హనుమంతారాయ చేపలమార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తున్నా పోతిన అవినాష్

0

 హనుమంతారాయ చేపలమార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తున్నా పోతిన అవినాష్

విజయవాడ 23 జనవరి: పశ్చిమనియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి హనుమంతరాయ చేపలమార్కెట్ నందు మరియు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం నాడు బిజెపి యువనాయకులు పోతిన అవినాష్, జనసేన 53వ డివిజన్ నాయకులు రేఖపల్లి శ్రీనుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోతిన అవినాష్ మాట్లాడుతూ హనుమంతరాయ చేపలమార్కెట్ కాంప్లెక్స్ మరియు షెడ్లలో వ్యాపారస్తులు పడుతున్న అనేక ఇబ్బందులు మరియు కాంప్లెక్స్ పరిధిలో మరమ్మత్తుల పనుల కొరకు పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన సత్వరమే సమస్య పరిష్కారానికి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. శాసనసభ్యుల వ్యక్తిగత కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మరియు నగరపాలకసంస్థ జోనల్ కమిషనర్ కీర్తన, ఈఈ వెంకటేశ్వరరెడ్డి మరియు ఇతర అధికారులతో పాటు నేను కూడా వ్యక్తిగతంగా పరిశీలించాము. కాంప్లెక్స్ బిల్డింగ్ కు రంగులు, డ్రైనేజీ వ్యవస్థ, షెడ్లలో ఎత్తుపల్లాలుగా ఉన్నటువంటి వాటిని సరిచెయ్యడం, కామన్ ఏరియాలలో సాయంత్రం నుంచి ఉదయం వరకు లైట్స్ వెలిగించడం జరుగుతుంది ఇలా అనేక అభివృద్ధి పనులను చెయిస్తునందుకు శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు నగరపాలకసంస్థ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ఈ కార్యక్రమంలో ఫిరోజ్, మోహిద్దీన్, ఆర్కే, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version