స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వైసిపి దుర్మార్గాలను ధీటుగా ఎదుర్కొన్నాడు ఎమ్మెల్యే సుజనా చౌదరి

0

 స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వైసిపి దుర్మార్గాలను ధీటుగా ఎదుర్కొన్నాడు

ఎమ్మెల్యే సుజనా చౌదరి 

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ తో కలిసి అభినందనలు తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో సోమవారం నిర్వహించిన పట్టాభిరామ్ అభినందన సభలో సుజనా చౌదరి పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజా ప్రతినిధులకు వాక్ స్వాతంత్ర్యం లేకుండా చేశారన్నారు.వైసిపి అరాచకాలను ఎండగడుతూ వారి దుర్మార్గాలను ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి పట్టాభి అని కొనియాడారు. అక్రమ కేసులు బనాయించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన కూడా పట్టాభి ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అభివృద్ధికి పట్టాభి కృషి చేయాలని మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version