సీనియర్ న్యాయవాది జ్యోత్స్న భౌతికకాయానికి మల్లాది విష్ణు నివాళులు

0

 *09.10.2024*

సీనియర్ న్యాయవాది జ్యోత్స్న భౌతికకాయానికి మల్లాది విష్ణు నివాళులు

రాజస్థాన్ లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి గుళ్ళపల్లి జ్యోత్స్న భౌతిక కాయానికి సీతారాంపురం కడియాల వారి వీధిలోని స్వగృహంలో బుధవారం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రమాదంలో మిగతా న్యాయవాదులు, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు క్షేమంగా బయటపడటం సంతోషమే అయినా.. జ్యోత్స్న మృతి తీరని లోటని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ఆమె నిరంతరం కృషి చేశారని చెప్పుకొచ్చారు. జ్యోత్స్న మృతి కుటుంబసభ్యులకే కాక సమాజానికి తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్, ఒగ్గు గవాస్కర్, రెడ్డి, కృష్ణవేణి ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version