విజయవాడ నగరపాలక సంస్థ
25-07-2025
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా జరగాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా జరగాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఈట్ స్ట్రీట్, వేముల శ్యామలాదేవి రోడ్డు, శ్రీకర్నాటి రామ్మోహన్ స్కూల్ వీధి, విశాలాంధ్ర రోడ్, బి ఆర్ టి ఎస్ రోడ్, సి కె రెడ్డి రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
శాతవాహన కాలేజీలో గల నాలుగు పోలింగ్ స్టేషనులను ఒకటి కర్నాటి రామ్మోహన్రావు స్కూల్లో, మూడు పోలింగ్ స్టేషన్లను ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో ఏర్పాటు చేసేందుకు ఏ ఈ ఆర్ వో లు మరియు సెంట్రల్ తహసిల్దార్ ప్రతిపాదించగా, సెంట్రల్ ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం పరిశీలించారు.
ఈట్ స్ట్రీట్ లో నిరంతరం డిసిల్టింగ్ పనులను చేస్తుండాలని పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను కచ్చితంగా నిషేధించాలని, ఎన్ఫోర్స్మెంట్ టీం కచ్చితంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని, విజయవాడ నగరం ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత నగరంగా, పర్యావరణహిత నగరంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు.
శ్రీ కర్నాటి రామ్మోహన్ రావు స్కూల్ రోడ్లో పర్యటించి అక్కడ కాంపౌండ్ వాల్ సరిగ్గా లేదని ఇంజనీరింగ్ అధికారులు ఆ గోడను పునరుద్ధరించాలని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణ వ్యర్ధాలను టౌన్ ప్లానింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తరలించాలని అధికారులను ఆదేశించారు.
విశాలాంధ్ర రోడ్డు పర్యటించి నగర సుందరీకరణ లో భాగంగా డివైడర్లలో గ్రీనరీ ని పెంచాలని, రంగులు వెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఏఈఆర్వోలు మరియు పర్యవేక్షణ ఇంజనీర్ ప్రాజెక్ట్ పి.సత్యకుమారి, సెంట్రల్ డిప్యూటీ తహసిల్దార్ సురేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.