కార్పొరేటర్ యలకల చలపతిరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ 56వ డివిజన్ విస్తృత స్థాయి సమావేసం

0

విజయవాడ
25-07-2025

స్థానిక 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేట లోని సిద్దార్థ స్కూల్ వద్ద స్థానిక డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ 56వ డివిజన్ విస్తృత స్థాయి సమావేసం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంఛార్జ్ వాసా ఆదినారాయణ బాబు ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాబు మోసాలను, ప్రజలకు ఇచ్చిన బాండ్లు, వైయస్ జగన్ ప్రెస్ మీట్ ని టివిలో చూపించారు. ఇంటింటికి క్యూ ఆర్ కోడ్ తో వెళ్లి ప్రజలతో ఆ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేపించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూ ఆర్ కోడ్ ని ఆవిష్కరించారు

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ తల్లికి వందనం షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి వర్తిపజేస్తామని చంద్రబాబు చెప్పదన్నారు. అందరికి వైసిపి హయాంలో ఇంటింటికి వెళ్లి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పధకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్ని ప్రజలకు ఎంత లబ్ది చేకూరిందని గతంలో ఎవరు చేయని విధంగా ఒక కాగితం రూపంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు. అర్హత ఉండి పథకం రాని వారికీ వెంటనే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కూటమి నేతలు మాత్రం ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్లి మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ముగ్గురికి అమ్మఒడి వస్తుందని ముగ్గురు పిల్లలకి కలిపి మూడు పదిహేను వేలు 45 వేలు వస్తుందని , 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి నెలకు 15 వందలు ఇస్తామని ఇంటికి ఇద్దరు ఉంటె ఇద్దరికీ నెలకి 15 వందలు చొప్పున సంవత్సరానికి 36 వేలు వస్తుందని, చదువు పూర్తయి ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకి 3 వేళ చొప్పున సంవత్సరానికి 36 వేలు ఇస్తామని ఇతరాలు పధకాలు వాటి ద్వారా వచ్చే లబ్దిని రాసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్రికరణ సుద్దితో జూన్ 24 నుంచి అమలు చేస్తామని సొంతకాలు పెట్టిన కాగితాలని ప్రజలకు ఇచ్చారన్నారు. చంద్రబాబు మాటలు ప్రజలెవ్వరూ నమ్మరని ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని కాగితం రూపంలో రాసి ఇచ్చాడని ప్రజలు నమ్మరని, జగన్ వస్తే సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తాయని, చంద్రబాబు వస్తే రెండు లక్షల రూపాయలు వస్తాయని ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చెప్పటి సంవత్సర కాలం పూర్తయిందన్నారు. 24 జూన్ 2024 న ఇస్తానన్నా పధకాలు ఇప్పటికి అమలు కాలేదని జూన్ 24 అయ్యి సంవత్సరం పూర్తయిందని. తల్లికి వందనం పోయిన సంవత్సరం అమలు చేయలేదని. చేయూత ఇప్పటికి అమలు చేయలేదని, రైతు భరోసా ఇప్పటికి అమలు చేయలేదని, ఉచిత బస్సు అమలు ఉగాది అన్నారు, సంక్రాంతి అన్నారు దాన్ని ఎప్పుడు అమలు చేస్తారో తెలీదు, ఆ పధకం ద్వారా గతంలో ఇంటి వద్ద బయలుదేరి శ్రీశైలం, అన్నవరం అన్ని చూసుకుంటూ రాష్ట్రమంతా తిరగవచ్చన్నారని కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకే పరిమితం చేస్తు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి చంద్రబాబు వచ్చాడన్నారు. ఆ దొంగ హామీలన్నీ ప్రజలకు గుర్తుకు చేయడం కోసం చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకుతెస్తూ పేరుతొ ఈ కార్యక్రమాన్ని చెప్పటడం జరిగిందన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు పత్రలలో పధకాలు వచ్చాయ లేదా అన్ని ప్రజలను అడిగి గుర్తుచేయాలన్నారు. చంద్రబాబు 5 లక్షల మంది పెన్షన్ తొలగించాడన్నారు. సుపరిపాలన పేరుతో దసరా వేషాలు వేసుకొని వస్తున్నారని, బుద్ధా వెంకన్న టోపీ కళ్ల జోడు పెట్టుకొని వస్తున్నాడని, నాగుల్ మీరా ఏమో జలీల్ ఖాన్ లాగా ఇద్దరి మనుషుల మధ్యలో బుజాల మీద చేయి వేసుకొని వెళ్తున్నాడని, కొని రోజులు బేగ్ తిరిగాడని ఇప్పుడు ఆటను కెనడా వెళ్లిపోయాడన్నారు.. ఎమ్మెల్యే, ఎంపీ వచ్చే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎవరు లేని అనాధ పరిస్థితి అయిపోయిందన్నారు. ఎమ్మెల్యే ఆఫిస్లో రోజుకో సియం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఫోటో దిగి పంపించేస్తున్నారన్నారు. కొని రోజులు క్రితం ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులని చెట్లు కొట్టించమని, కల్వర్టు కింద రాలు బాగు చెప్పించామని, లైట్లు బాగుచెప్పించామని, పాంప్లేటు పంచమన్నారు. వైసిపి హయాంలో అన్ని రోడ్లు వేశామన్నారు, అరకొర మిగిలిన రోడ్లు కూడా నేడు సుజనా చౌదరి చేసిన శంకుస్థాపనలు కూడా తన హయాంలో శాంక్షన్ చెప్పించినవేనన్నారు. సుజనా చౌదరి లెటర్ హెడ్ మీద శాంక్షన్ అయింది ఒకటి కూడా లేదన్నారు. వరదలలో చంద్రబాబు బోట్ లు వేసుకొని వచ్చి ప్రజలకు చేసిందేమి లేదన్నారు. సంపద సృష్టిస్తాం అనే పేరుతొ సినిమాలు తీసుకొని టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటున్నారన్నారు. జగన్ 5 ఏళ్ల హయాంలో 3 లక్షల కోట్లు అప్పు చేసాడని మొత్తం పథకాలన్ని అమలు చేసాడని కానీ కూటమి వచ్చిన సంవత్సరంలోనే 1 లక్ష 75 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసారని ఏ పధకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితిలో ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం పధకాలు అమలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారని కొనియాడారు. నాకు ఓటేయని వాళ్లకు కమ్మినిస్టూలకు, వైసిపి వాళ్లకు పధకాలు ఇవ్వదని చంద్రబాబు చెపుతున్నాడని అన్నారు. వైసిపి హయాంలో కాలర్ ఎగరేసుకొని తిరిగేవాళ్లమని ప్రతి ఒక్కరికి పధకాలు అందించామని అన్నారు. ఇవ్వని ప్రజలకు గుర్తుచేయాలన్నారు. కుట్రపూరితంగా మీడియా ఛానళ్లను బ్లాక్ చేసి బెదిరిస్తున్నారన్నారు. చంద్రబాబు కు ఒత్తాసు పలికే ఛానళ్లను మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారన్నారు. సంవత్సర కాలంలోనే భారత దేశంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రబుత్వానికేనని అన్నారు. ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను, బాండ్లను చూపించి ప్రశ్నించే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాలలో పదవులు పొందిన వారు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version