సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్

0

 సమస్యల పరిష్కారమే లక్ష్యం 

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ 

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా మిత్రాలను ఏర్పాటు చేశారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ తెలిపారు

 బుధవారం పశ్చిమ లోని 34,35, డివిజన్ల పరిధిలోని ఖుద్దుస్ నగర్, పెజ్జోని పేట తదితర ప్రాంతాల్లో సుజనా మిత్రలతో కలిసి వారు పర్యటించారు. 

 స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, 

రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం నిర్వహణ పనితీరును స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సుజనా మిత్రాలతో కలిసి పర్యటిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు సుజనా మిత్రాలు, కూటమి నేతలందరం ప్రజాసేవలో భాగస్వామ్యులయ్యామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా ముందుకు వెళుతున్నామన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే సుజనా చౌదరి వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని అడ్డూరి శ్రీరామ్ తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక కార్యచరణను రూపొందించి సుజనా ఫౌండేషన్ ద్వారా   

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుజనా మిత్రాలను ఏర్పాటు చేశారన్నారు

వారధిగా నిలిచిన సుజనా మిత్రాలకు ప్రజలు తమ సమస్యలను తెలియజేయవలసిందిగా ఆయన కోరారు.

ఈ పర్యటనలో ఎన్డీఏ కూటమి నేతలు బొడ్డు నాగలక్ష్మి , భూదాల నందకుమారి, ఆకుల రవిశంకర్, సారిపల్లి రాధాకృష్ణ,సుజనా ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరమాచనేని కిరణ్, హరీష్, సుజనా మిత్ర సిబ్బంది బొర్రా లక్ష్మీప్రసన్న, శ్రీరాం లలిత, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version