శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు

0

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 67 : స్థానిక  చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో  జరుగుతున్న దసరా మహోత్సవంలో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, ఆయన కుమారుడు డాక్టర్ రాజ్ కుమార్ దర్శించుకుని పూజలు చేశారు. అలాగే శ్రీశైలం లోని నగరాల నిత్యాన్నదాన వసతి సత్రం ఫౌండర్ సెక్రెటరీ కొరగంజి జగన్ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆర్టీసీ ఎండి సిసి బాలస్వామి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి   శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు,  కార్యదర్శి  మరుపిళ్ల హనుమంతరావు,  గౌరవాధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. అలాగే దసరా సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని , ఆయా కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్ (రాజా), శీరం వెంకట్రావు, కార్యవర్గ సభ్యులు మజ్జి ఈశ్వరరావు, తొత్తడి భరత్ కుమార్ , పోతిన సాంబశివరావు, భోగవల్లి శ్రీధర్ , ముదిలి గణేష్, బంక హనుమంతరావు, ఈది ఎల్లా రాజారావు, పిళ్లా విజయ్ కుమార్, మజ్జి శ్రీనివాసరావు పోతిన వెంకట ధర్మారావు, గూడేల రామకృష్ణ,  కామందుల నరసింహారావు, తమ్మిన సూర్యకుమారి, పనుకు రమ,తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version