‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ’ ఇంద్రకీలాద్రి పై ఆక్టోపస్ మాక్ డ్రిల్

0

 20మార్చి 2025

 

  ‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల     దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ’

ఇంద్రకీలాద్రి పై ఆక్టోపస్ మాక్ డ్రిల్ 

శ్రీ దుర్గామల్లేశ్వరులు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి పై భక్తుల భద్రత, ఆలయ పరిరక్షణ లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఏవిధంగా వ్యవహరించాలి అనే విషయం ప్రధానంగా తీసుకుని – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆక్టోపస్ విభాగం అధికారులు తేది. 19.03.2025 అర్దరాత్రి నుండి 20.03.2025 తెల్లవారు జాము వరకు -ఇంద్రకీలాద్రి పై మాక్ డ్రిల్ నిర్వహించారు.

అవాంచనీయ శక్తులు మెట్ల మార్గం నుండి ఇంద్రకీలాద్రి కి చేరుకున్నట్లు, ఆ సమాచారం ఆలయ అధికారులు, వన్ టౌన్ పోలీసులు నుండి అందుకున్న ఆక్టోపస్ విభాగం వారు ముందుగా జమ్మిదొడ్డి సమావేశం హాల్ లో దేవస్థానం, పోలీస్, రెవిన్యూ తదితర విభాగాల అధికారులతో చర్చించి, దేవస్థానం మ్యాప్ ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించి, ఇంద్రకీలాద్రి కి సాయుధ కమెండోలు చేరుకొని, సాహసవంతంగా దుండగుల వద్ద ఉన్న పేలుడు సామాగ్రి, ఆయుధాలు నిర్వీర్యం చేసి,వారిని అదుపులోకి తీసుకొని భక్తులను ఎలా రక్షించారు అనేది సీన్ క్రియేట్ చేసి, పరిష్కారం చూపించారు. ఇటువంటి పరిస్థితిలో ఆలయ సిబ్బంది, స్థానిక పోలీసులు,సెక్యూరిటీ, వైద్య సిబ్బంది,రెవిన్యూ సిబ్బంది ఎలా వ్యవహరించాలి అనేది వివరించారు.

ఈ అవగాహన కార్యక్రమం ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాజారెడ్డి, ఆక్టోపస్ డీ ఎస్పీ శ్రీ తిరుపతయ్య ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు, వన్ టౌన్ పోలీసులు, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version