శాసనసభ సాక్షిగా నా తల్లిని వైకాపా సభ్యులు అవమానించారు మంత్రి లోకేశ్‌

0

 శాసనసభ సాక్షిగా నా తల్లిని వైకాపా సభ్యులు అవమానించారు మంత్రి లోకేశ్‌

గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైకాపా సభ్యులు అవమానించారని మంత్రి లోకేశ్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల మూడో రోజు ఆయన శాసనమండలిలో మాట్లాడారు.

సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారు. సింహంలా సింగిల్‌గా నిలబడ్డారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే.. ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. తెదేపా నేతలపై మళ్లీ ఇవాళ అసభ్యకర పోస్టులు చేస్తున్నారు. మాట్లాడాలను కుంటే మేమూ మాట్లాడగలం. ఏనాడూ జగన్‌ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు నా తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు అన్ని మాట్లాడిన జగన్‌ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదు. నా తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారు” అని లోకేశ్‌ నిలదీశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version