శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు పాల్గొని భక్తులకు అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టి, భక్తులకు స్వయంగా వడ్డించారు

0

 14-10-2024

64వ డివిజన్ ప్రజాశక్తి నగర్

ధి:14-10-2024 సోమవారం మధ్యాహ్నం 12:30″గం లకు” సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజాశక్తి నగర్ నందు స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కనకదుర్గ దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అయినది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:- సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు పాల్గొని భక్తులకు అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టి, భక్తులకు స్వయంగా వడ్డించారు

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-అన్నదానం ద్వారా భగవంతుని సేవ చేస్తున్నట్లు అని, ఇది ఒక పవిత్రమైన దానధర్మం దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని అన్నదానం ద్వారా పేదలు, నిరుపేదలు మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించి అందరూ కలిసి భోజనం చేయడం వల్ల సమాజంలో ఐక్యత పెరుగుతుంది, అన్నదానం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది అని

అన్నదానం ద్వారా మనం సమాజ సేవ చేయడంతో పాటు, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందించవచ్చు అని,విజయవాడ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రులు నిన్నటితో ఘనంగా ముగిశాయి, హంస వాహనం పై తెప్పోత్సవం తో అమ్మవారి ఆశీర్వచనాలు భక్తులు అందుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, దేవాదాయ శాఖ వారు భక్తులకు మంచి నీరు, అన్న ప్రసాదాలుతో పాటు అన్ని సౌకర్యాలు సమకూర్చారు, భక్తులను ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షోతో అలరించారు అని,రాష్ట్రానికి ఆలయాలకు పూర్వ వైభవం వచ్చింది అని, ఈ సందర్భంగా ఈరోజు ప్రజాశక్తి నగర్ కనకదుర్గ దేవాలయం కమిటీ వారు ఏర్పాటు చేసిన 3000 వేల మంది భక్తులకు అన్నదానం చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నదని బొండా ఉమా తెలియజేశారు

ఈ కార్యక్రమంలో:-టిడిపి రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, పాలగని శివ, కాకొల్ల రవికుమార్,కోరాడ రమణ, కంకణాలు బాబు, కోటేశ్వరరావు,SK బాబు,సాయి,రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version