విజయవాడ నగరపాలక సంస్థ
20-03-2025
శాఖాధిపతులతో కౌన్సిల్ ఎజెండా పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సమీక్ష సమావేశం
మార్చ్ 25, 2025 న జరిగే కౌన్సిల్ ఎజెండా పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో బుధవారం ఉదయం శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనలను శాఖధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సెక్రటరీ వసంతలక్ష్మి, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాజ్యం, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, జాయింట్ డైరెక్టర్ అమృత్ మరియు ఎస్టేట్ ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ లత, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు