శనివారం జి ఎన్ ఆర్ ఎం సి హై స్కూల్లో బుక్స్ కిడ్స్ పంపిణీ చేసిన శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి

0

 విజయవాడ పశ్చిమ 

శనివారం జి ఎన్ ఆర్ ఎం సి హై స్కూల్లో బుక్స్ కిడ్స్ పంపిణీ చేసిన శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి

విద్యార్థులను విద్యలో రాణించే విధంగా కృషి

చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ సుజన చౌదరి స్పష్టం చేశారు. ప్రభుత్వం పాఠశాలల లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని తెలిపారు. 

రామరాజ్య నగర్ లోని గొల్లపల్లి నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు పుస్తకాలు కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనాచౌదరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో పాటు విద్యార్థులను విద్యలో రాణింప చేసే విధంగా కృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను కూడా చదువులో ముందుకు తీసుకురావాలని సూచించారు. కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు చదువుకున్న స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బుక్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ స్కూల్ హెచ్ఎం వివి రవికుమార్, ఎంఈఓ పివి నరసింహారావు, నాయకులు మైలవరపు దుర్గారావు, ఎస్ఎంసి చైర్పర్సన్ ఎం రజిని బిజెపి మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్ బిజెపి నాయకులు టిడిపి నాయకులు జనసేన నాయకులు

తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version