శంకర్ కేవ్ సెంటర్లో వంగవీటి రంగా జయంతి ఘనంగా నివాళులర్పించారు. బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు

0

 విజయవాడ పశ్చిమ 

శంకర్ కేవ్ సెంటర్లో వంగవీటి రంగా జయంతి ఘనంగా నివాళులర్పించారు  గురువారం

పేదల అభ్యున్నతి కోసం పోరాటం చేసి, ఆయన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి, నాయకుడు వంగవీటి మోహనరంగా అని, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు

, స్పష్టం చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. 

గురువారం వంగవీటి మోహన రంగా 77వ జయంతి కార్యక్రమం శంకర్ కేఫ్ సెంటర్లో బిజెపి నాయకులు వడ్లానిమాధవరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బిజెపి నాయకులు అడ్డూరి శ్రీరామ్ హాజరై రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని, వారి అభ్యున్నతికి తన ప్రాణాల సైతం ఫణంగా పెట్టిన మహానీయుడు వంగవీటి మోహనరంగా అని కొనియాడారు. మరణించి 35 సంవత్సరాలు దాటినా ఆయన పట్ల ప్రజల్లో అభిమానం తగ్గలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆయన జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రంగా జీవితాన్ని నేటి యువత, సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్రంగా అని కీర్తించారు. నిర్వాహకులు వడ్లాని మాధవరావు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు రంగా అని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంజయ్ జైన్, సోలంకి రాజు, సురా బత్తుల మల్లేశ్వరరావు, కే వి బి శర్మ, వడ్లాని శంకర్రావు, చందన నాగేశ్వరరావు, పల్నాటి దుర్గారావు, సనగా వెంకటేశ్వరరావు, మజ్జి మురళి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version