వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వెంటనే అరెస్ట్ చేయాలి కులదూషణపై గవర్నర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం విశాఖ యాత శెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘం

0

 విశాఖపట్నం

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వెంటనే అరెస్ట్ చేయాలి

 కులదూషణపై గవర్నర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం

విశాఖ యాత శెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘం

విశాఖపట్నం, ఆగస్టు 11 : పరాయి మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను హింసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని తల్లి, కుటుంబసభ్యులపై చట్టపరంగా కఠినచర్యలు చేపట్టి అరెస్ట్ చేయాలని విశాఖ యాత శెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. మీడియా ముఖంగా శ్రీనివాస్ తల్లి చేసిన కులదూషణను తీవ్రంగా ఖండించారు.

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే వెంటనే దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భార్యాపిల్లలు ఉండగా వేరే మహిళతో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ను అతని తల్లి, కుటుంబసభ్యులు మందలించకుండా, తమకు న్యాయం చేయాలని అడిగిన దువ్వాడశ్రీనివాస్ భార్య వాణి, అతని కుమార్తె డాక్టర్ హైందవిని పరుష పదజాలంతో దూషించడమే కాకుండా, శెట్టిబలిజ యాత గౌడ సంఘీయులను జాతి తక్కువ, కులం తక్కువ అందంగా ఉండరు అంటూమీడియాలో దువ్వాడ శ్రీనివాస్ తల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీటెక్ చదివి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి మంచి పొజిషన్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ అల్లుడు డాక్టర్ హైందవి భర్త మోహన్కుమార్ను కులం పేరుతో దూషించిన దువ్వాడ శ్రీనివాస్ తల్లి వ్యాఖ్యలనువిశాఖ యాత శెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గీత కులాలను కించపరిచిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని, వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే గీత కులాల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోపాటు ముఖ్యమంత్రి, గవర్నర్లకు ఫిర్యాదు చేస్తామన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలి. మహిళలపై వేధింపులు, కులదూషణపై జాతీయ మహిళా సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాలు స్పందించాలని కోరారు.

సమావేశంలో ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు, సంచార సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు రాజీవ్ గౌడ్ యాత, ఉత్తరాంధ్ర యాత శెట్టిబలిజ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఒడిసెల సూరిబాబు, గెద్దాడ రమేష్, పోలవరపు శ్రీనివాసు, దొడ్డి రాజు, వడిసల సంపత్, సంపంగి ఈశ్వరరావు, కొల్లి ఈశ్వరరావు, నెల్లి రాజు, పిల్లి రమణ, పంపాన కన్నబాబు తదితర గీత సంఘీయులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version