వీర బాలల దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

0

 వీర బాలల దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి 

బాబా జొరావర్ సింగ్, బాబా ఫతేసింగ్ ల అసమాన సాహసాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని 

ఎమ్మెల్యే సుజనా చౌదరి విద్యార్థులకు సూచించారు. వీర్ బాల్ దివాస్  కార్యక్రమంలో భాగంగా కొత్తపేట హిందూ హైస్కూల్ ఆవరణలో  శనివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ధర్మం, విశ్వాసం, నియమాలపై   దృఢంగా ఉన్న బాబా జోరావర్ సింగ్, బాబా ఫతేసింగ్ ల బలిదానం నేటి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు.

1907 లో మొగల్ పాలకులు మతం మారాలంటూ వారిని అనేక ఇబ్బందులు పెట్టిన కుడా వారి మతం యొక్క గౌరవాన్ని కాపాడటానికి ఆదర్శాల కోసం నిలబడి చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ  డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్ గా ప్రకటించారని తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వీర గాధలు విద్యార్థులకు తెలియజేయాలన్నారు. నేటి విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే సుజనా సూచించారు 

కార్యక్రమంలో  హిందూ హైస్కూల్ ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు, ఎం ఎస్ ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ పి శ్యామల, ప్రెసిడెంట్ మద్ది సుబ్బారావు, సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ గోనుగుంట్ల రామారావు, విజయ్ కుమార్, బ్రహ్మేశ్వరరావు, గురు గోభింద్ సింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు  హర్విందర్ సింగ్, కులదీప్ కౌర్ కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్, ఉమ్మడి వెంకటేశ్వరరావు, వక్కలగడ్డ భాస్కరరావు, బోగవల్లి శ్రీధర్, పైలా సురేష్, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version