విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి మాట్లాడుతూ. మా సంఘాన్ని గుర్తించి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వాలని

0

విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి మాట్లాడుతూ. మా సంఘాన్ని గుర్తించి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వాలని

విజయవాడ  26-1-2025

 రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ నూతన కార్యవర్గ సమావేశం విజయవాడ హనుమాన్ పేట మారుతి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘం  రాష్ట్ర అధ్యక్షులు చేవూరు  రామస్వామి మాట్లాడుతూ ఈ సమావేశంలో రాష్ట్ర 26 జిల్లాల నుంచి సంఘ ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా సంఘానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు అదేవిధంగా మా సంఘాన్ని గుర్తించి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వాలని ఆయన ఉన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను అమలు చేయాలని ఆయన తెలిపారు. విశ్వబ్రాహ్మణులు వడ్రంగి కుమ్మరి కంచర, స్వర్ణకార, శిల్పకళాకారు మొదలగువారు ఈ వృత్తిలో ఉన్నారని, వారని కూడా ప్రభుత్వం గుర్తించి రావాల్సిన నిధులను వారికే కేటాయించే విధంగా నిర్ణయించా లని, అన్నారు. అంతేకాకుండా అమరావతి రాజధాని లో ఐదు ఎకరాల భూమిని విశ్వబ్రాహ్మణ సంఘానికి  కేటా యించాలని కోరారు. బ్రాహ్మణ నాయి బ్రాహ్మణుల మాదిరిగా పలు దేవాలయాల్లో మా కులస్తులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెసి ప్రసాద్, బొందల పాటి ఉమామహేశ్వ రరావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి, రాష్ట్ర కోశాధికారి ఫిరంగి రమణా చార్య, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version