విశాఖ ఉక్కును మళ్లీ కాపాడుకోగలిగాం : సీఎం చంద్రబాబు

0

విశాఖ ఉక్కును మళ్లీ కాపాడుకోగలిగాం : సీఎం చంద్రబాబు

మంగళగిరి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిర్వహణకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకున్నది ఎన్డీయే ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో స్టీల్‌ ప్లాంట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. పట్టుదలతో పనిచేశాం. చిత్తశుద్ధితో ముందుకు పోయాం. ఏడు నెలలుగా చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఫలించాయి. ప్రధాన మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారు. అసాధ్యమనుకున్నది సాధ్యమైంది. ఇది విశాఖ ప్రజల అభీష్టం..కార్మికుల శ్రమ. విశాఖ ఉక్కును మళ్లీ కాపాడుకోగలిగాం. రూ.11,440 కోట్లు రివైవ్‌ ప్యాకేజీ ఇవ్వడం అరుదైన అనుభవం. స్టీల్‌ ప్లాంట్‌కు 20వేల ఎకరాల భూమి ఉంది. ఏ స్టీల్‌ ప్లాంట్‌కు ఇంత భారీ భూమి లేదు. అందరం కలిసి కష్టపడి స్టీల్‌ ప్లాంట్‌ను అభివృద్ధి బాటలో నడిపించి మంచి పేరు తీసుకురావాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version