వివిధ సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు

1
0


10.07.2025

వివిధ సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు
అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనుచరులు తమపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని.. దయ చేసి వైసీపీ నేతలు పెట్టిన అక్రమ ఎస్సీ,ఎస్టీ కేసులు కొట్టేసేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలానికి చెందిన ఎస్. పీరయ్య, జి. సుబ్బనర్సయ్య, మేక భాస్కర్ తదితరులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబులకు అర్జీఇచ్చి అభ్యర్థించారు. అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించిన నేతలు వెంటనే అధికార్లతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

• నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదకొండూరు గ్రామానికి చెందిన యెండ్లూరి గోపి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమి వెబ్ ల్యాండ్ లో కనిపించడంలేదని.. దీనిపై అధికార్లకు ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా తిప్పుకుంటున్నారే కాని సమస్యను పరిష్కరించడంలేదని దయ చేసి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
• నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామానికి చెందిన పదర్ల తిమోతి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తాము కొనుగోలు చేసిన భూమిని సర్వే చేసి సరిహద్దులు చూపాలని అధికార్లకు అర్జీలు పెట్టినా పట్టించుకోవడంలేదని.. దయ చేసి తమ భూమిని సర్వే చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
• అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం నర్సీపట్నంకు చెందిన పాకలపాటి వెంకటనరసయ్యమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ… విజయనగరం జిల్లా విజయనగరగ మండలంలోని ద్వారపూడి గ్రామం పరిధిలో ఉన్న తమ భూమిని తమకు తెలియకుండా.. వెబ్ ల్యాండ్ నందు తొలగించి మరోకరికి ఎక్కించారని.. దీనిపై విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన వల్లేటి లోవరాజు గ్రీవెన్స్ లో అర్జీఇచ్చి విజ్ఞప్తి చేస్తూ… గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలో మామిడితోట వద్ద కాపలాగా ఉన్న తమపైకి అకారణంగా వచ్చి కులం పేరుతో దూషించి తమను కొట్టిన నరసింహరావు అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here