విలన్ ‘గుడివాడ రౌడీ’ .. ఇక లేరు.

0

 .

విలన్ ‘గుడివాడ రౌడీ’ .. ఇక లేరు.

90వ దశకంలో మాస్ హీరోగా తిరుగులేకుండా దూసుకుపోతున్న టైంలో బాలకృష్ణకు విలన్ గా నటించిన .. మోహన్ రాజ్ అలియాస్ కీరికదన్ జోస్ని న్న అనారోగ్యంతో కన్ను మూశారు

అసెంబ్లీ రౌడీ లో గుడివాడ రౌడీ గా తన పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అచ్చు తప్పు అంటూ పలికే మ్యానరిజం వరస ఆఫర్లు తీసుకొచ్చింది.

రౌడీ ఇన్స్ పెక్టర్ లో  బొబ్బర్లంక రామబ్రహ్మాం మరో మేలి మలుపు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో బాలయ్యతో సవాల్ చేయించునే సీన్ బాగా పండేందుకు కారణం ఇదే. ఆ తర్వాత నిప్పు రవ్వ, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, పవిత్ర ప్రేమ, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు ఇలా ఎన్నో చిత్రాల్లో బాలకృష్ణతో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. అప్పట్లో బి గోపాల్ ప్రతి చిత్రంలో ఈయన ఉండేవారు.

వెంకటేష్ పవిత్ర బంధం, సరదా బుల్లోడు, పోకిరిరాజా, రాజశేఖర్ శివయ్య, మోహన్ బాబు సోగ్గాడి పెళ్ళాం, చిరంజీవి మెకానిక్ అల్లుడు, నాగార్జున ఇద్దరూ ఇద్దరే లో మోహన్ రాజ్ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

300 సినిమాలకు పైగా నటించిన ఈ విలక్షణ విలన్ తిరువనంతపురంలో కన్ను మూశారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో ఏఈఓగా పని చేశారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉద్యోగం మానుకోలేదు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version