విజయవాడ పశ్చిమ ఈద్గా ప్రార్థనలో సుజనా చౌదరి

0

 

విజయవాడ పశ్చిమ

ఈద్గా ప్రార్థనలో సుజనా చౌదరి


పశ్చిమ నగర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు పశ్చిమ శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భవానిపురంలోని ఈద్గామహల్ లో ప్రార్థనలలో ఆయన పాల్గొని ప్రార్థనలు చేశారు.

బక్రీద్ పర్వదినం సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానిపురం ఈద్గాలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నగరాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ నగరంలో యువతకు కావలసిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. అందుకు కావలసిన విధంగా ప్రణాళిక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎం.ఎస్ బేగ్ మాట్లాడుతూ హజ్ యాత్రికులకు,మెరుగైన రాయితీ ప్రకటించారని ముస్లింలకు అండగా ఉండేది టిడిపి ప్రభుత్వం అని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ మాజీ కార్పొరేటర్ రామయ్య టిడిపి నాయకులు బిజెపి నాయకులు జనసేన నాయకులు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version