వారధి లో విదేశీ మహిళ వినతి సమస్యలు పరిష్కారమే మాధ్యేయం.రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్

0

 భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ 

వారధి లో విదేశీ మహిళ వినతి

సమస్యలు పరిష్కారమే మాధ్యేయం.రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్

విజయవాడ …యుకే కు చెందిన స్టార్ట్ ప్  సిఇఒ నాటలీ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో వారధి కార్యక్రమం లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ గారి ని కలిసి పలు సమస్యలు పై చర్చించారు.

యూకేలో స్టార్ట్ ప్ సిఇఒ నాటలీ సాంకేతిక రంగాల్లో ను ఎడ్యుకేషన్ రంగం లో ను పని చేస్తున్నారు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా 190 మిలియన్ మహిళలు ఎండ్రోమెట్రియాసిస్ సమస్యతో బాధపడుతున్నారు వారి కి ఉపశమనం కలీగించేదుకు ప్రయత్నం చేస్తానని ప్రభుత్వం వైపు నుంచి సహకారం కోరారు.సమస్యలు పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని మంత్రి బదులిచ్చారు.

విజయవాడ

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ..

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి.. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తున్నామన్నారు 

వారధి కార్యక్రమం పేరుతో ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం బీజేపీ చేపట్టిందన్నారు 

వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నాం

ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతున్నాం

మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి.. పాలో అప్ చేస్తున్నాం

యాక్షన్ పాన్ పెట్టుకుని.. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం

ఎక్కువుగా భూసమస్యలు, ఆరోగ్యానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి

ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్దికి అనేక ప్రణాళికలు సిద్దం చేశాం

మూడు కేటగిరీలుగా సమస్యలను గుర్తించి.. తక్షణం చేయాల్సినవి ముందు పూర్తి చేస్తున్నాం

ఆర్ధిక వనరులను కూడా దృష్టిలో ఉంచుకుని వసతులపై చర్యలు తీసుకుంటున్నాం

మెడికల్ పరికరాలు, ఇతర సదుపాయాలపై ఆడిట్ చేస్తున్నాం

త్వరితగతిన ప్రభుత్వ ఆసుపత్రుల రూపరేఖలు మార్చి ప్రజల్లో నమ్మకం పెంచేలా చేస్తాం

త్వరలోనే సర్కారు దవాఖానాల్లో ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందేలా చేస్తాం

 వందకు పైగా వినతులు రాగా 70వరకు పరిష్కార మార్గాలు సూచించారు 

15సమస్యలు వరకు సిఎం రిలీఫ్ కు సంబంధించిన వి కావడంతో ఫోన్ ద్వారా పరిష్కారం చేసారు.

మంత్రి తో పాటు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, బిజెపి సీనియర్ నేత వల్లూరు జయప్రకాష్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, వారధి కోఆర్డినేటర్ కిలారు దిలీప్, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version