వర్ధంతి నివాళి. గ్లామర్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా.. నటి మంజుల

0

 వర్ధంతి నివాళి.

గ్లామర్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా.. నటి మంజుల

70వ దశకంలో అత్యంత పాపులర్ హీరోయిన్ ఆఫ్ సౌత్ ఇండియా గా పేరుతెచ్చుకున్న నటి మంజుల 1969లో సినీరంగంలో ప్రవేశించి చిరకాలం లోనే అగ్రతార హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. అందం అభినయం గ్లామర్ చిలిపిదనం డాన్స్ అన్నీ మూర్తీభవించిన మంచి నటి మంజుల. హీరోయిన్ గా ఎం జి ఆర్ తో నటించిన తొలి తమిళ చిత్రం సూపర్ హిట్ కావడంతో దక్షిణభాషా చిత్రాలలో అవకాశాలు వెల్లువెత్తాయి. నాలుగు దక్షిణాది భాషల్లో అందరి టాప్ హీరోలతోనూ జతకట్టింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో హీరో కృష్ణ సరసన నటించిన మాయదారి మల్లిగాడు చిత్రం మంజులకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఇందులో పాటలు కూడా శ్రోతలను ఉర్రూతలూగించాయి. మంచి మనుషులు, బంగారు బొమ్మలు, వాడే వీడు,, ఇద్దరే ఇద్దరు, భలే దొంగలు, దొరబాబు వంటి చిత్రాలు మంజుల అభినయ అందాలకి అద్దం పట్టాయి. యుగళ గీతాలలో చాలా చలాకీగా నటించేది. తన సినీ కేరీర్ లో సుమారు పన్నెండేళ్ళ పాటు హీరోయిన్ గా నటించి తర్వాత పెద్ద తరహా పాత్రల్లో నటించింది. 1976లో ప్రసిద్ధ కన్నడ నటుడు విజయ్ కుమార్ ని పెళ్లి చేసుకుని ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version