వర్గీకరణ కు వ్యతిరేకంగా.. జరిగే భారత్ బంద్ లో భాగంగా మాలమహానాడు.

0

 

వర్గీకరణ కు వ్యతిరేకంగా.. జరిగే భారత్ బంద్ లో భాగంగా మాలమహానాడు.

 దళిత బహుజన పార్టీ DBP ఆధ్వర్యంలో నేడు పాయకరావుపేట లో ఆందోళన ప్రదర్శన చేసారు. అంబేద్కర్ కాలనీ. బైపాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం జంక్షన్ మీదుగా చిత్రమందిర్ వరకూ ర్యాలీ చేయడం జరిగింది. వర్గీకరణ వద్దు.. రాజ్యాధికారం ముద్దు. దళిత జాతి ఐక్యత వర్ధిల్లాలి. విచ్చిన్నం వాదులు నశించాలి అంటూ నినాదాలు చేసారు.ఎస్సీ. ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ మీద సుప్రీం కోర్ట్ ఇచ్చిన రాజ్యాంగం వ్యతిరేక తీర్పు ఉపసo హరించికోవాలని. వర్గీకరణ అమలు కు ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ. చంద్రబాబు. పవన్ కళ్యాణ్ NDA సర్కార్ ల చర్యలు తక్షణమే మానుకోవాలని కేంద్ర రాష్ట్ర సర్కార్ లను నాయకులు డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా అధ్యక్షులు దువ్వాడ దావీదు రాష్ట్ర నాయకురాలు దాసరి అన్నపూర్ణ. మాలమహానాడు రాష్ట్ర నాయకులు దాసరి. రామచంద్రరావు. పాయకరావుపేట అసెంబ్లీ ఇంచార్జ్ బడుగు అచ్చరావు. జాన్. తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version