వరద బాధితులకు మేమున్నామని… ఎన్.ఆర్.ఐ. జనసేన అమెరికా విభాగం సాయం

0

 వరద బాధితులకు మేమున్నామని…

ఎన్.ఆర్.ఐ. జనసేన అమెరికా విభాగం సాయం

విజయవాడ, పరిసరాల్లోని వరద బాధితులకు మేము సైతం అంటూ జనసేన ఎన్.ఆర్.ఐ. అమెరికా విభాగం అండగా నిలిచింది. పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నిత్యావసర సరుకుల వాహనాలను శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడతోపాటు వరదలకు దెబ్బ తిన్న పెద్దపులిపాకలో 1020 కుటుంబాలకు రూ.20 లక్షలు విలువ చేసే నిత్యావసరాల కిట్లను అందించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ప్రతి కిట్ లో 8 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె, కిలో ఉప్పు, కారం, చింతపండు ఉన్నాయి. వీటిని వరదలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు స్వయంగా జనసేన ఎన్నారై అమెరికా విభాగం సభ్యులు అందజేస్తారు. ఈ సభ్యుల సేవా కార్యక్రమాలను హరిప్రసాద్ అభినందించారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ లోని సేవా తత్పరత ఇచ్చిన స్ఫూర్తితో పార్టీ నాయకులు శ్రేణులు ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో అందిస్తున్న చేయూత ఎంతో విలువయినదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన ఎన్ఆర్ఐ అమెరికా విభాగం సభ్యులు అనిల్ అనుసూరు, స్వామి అనిశెట్టి, సాయి రాజా కొత్తమాసు, సాయి నండూరి, సప్తగిరి ఇందుగుల, పార్టీ నేతలు సందీప్ పంచకర్ల, చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వర రావు, శ్రీ ఓదూరి కిషోర్, శ్రీ నక్కా తాతీలు తదితరులు పాల్గొన్నారు. 

పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి ఆధ్వర్యంలో…

వరద బాధితుల సహాయార్థం పార్టీ కార్యక్రమాల కమిటీ కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు తన వంతు సాయాన్ని అందజేశారు. వరద ప్రాంతాల్లో పంచేందుకు 400 చీరలు, 400 దుప్పట్లు, 2 వేల బిస్కెట్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. వీటిని హరి ప్రసాద్ చేతుల మీదుగా వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర నాయకులు ఆర్గానిక్ ప్రసాద్, నెల్లూరు జిల్లా నాయకులు జగదీశ్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version