వరద ప్రమాదం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండండి పునరావాస కేంద్రాల్లో అల్పాహారం, భోజనం, వైద్య శిబిరాలు పటిష్టంగా నిర్వహించాలి.

0

 వరద ప్రమాదం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండండి

పునరావాస కేంద్రాల్లో అల్పాహారం, భోజనం, వైద్య శిబిరాలు పటిష్టంగా నిర్వహించాలి.

త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలు-అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

         ఏలూరు/నూజివీడు, జూలై,22….గోదావరి ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కారణంగా వరద ఉధృతి పెరుగుతున్నందున సహాయ పునరావాస కార్యక్రమాల అమల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అధికారులను ఆదేశించారు. సోమవారం గోదావరి వరద ఉధృతి పరిస్ధితిపై ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భధ్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 6 గంటలు నాటికి 49.10 అడుగులు వరద నీటిమట్టం చేరుకున్న దృష్ట్యా దానికి అనుగుణంగా పునరావాస కార్యక్రమాలు యుద్ధప్రాతిపధికన పూర్తిచేయాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో పూర్తి పర్యవేక్షణ చేయాలన్నారు. వరద పునరావాస కేంద్రానికి వచ్చేవారందరికి మౌలిక సదుపాయాలు పక్కాగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రానికి వచ్చిన ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురకాకుండా వారికి వసతి ఏర్పాటుతోపాటు అల్పాహారం, టీ, భోజన సౌకర్యం, వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పునరావాస కేంద్రాలకు అధికారుల సూచనలమేరకు తరలిరావాలని సూచించారు. 12 పునరావాస కేంద్రాల్లో సుమారు 6 వేల మంది బాధితులకు ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. కుక్కునూరు మండలంలో 2 వేలు, వేలేరుపాడు మండలంలో 4 వేల మందికి పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. నిత్యావసర వస్తువులతోపాటు 15 వేల టన్నుల కాయగూరలు పునరావాస కేంద్రాలకు సరఫరాకోసం అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఏ రోజుకారోజు కాయగూరలను మార్కెటింగ్ శాఖ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెంచే విధంగా జిల్లా యంత్రాంగం వరద సహాయక చర్యలు నిర్వహించాలని మంత్రి చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version