వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పురందరేశ్వరి

0

 వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి 

పురందరేశ్వరి 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భవానిపురం ఎన్డీయే కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన వనమహోత్సవ కార్యక్రమంలో పురందరేశ్వరి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పురందరేశ్వరి మాట్లాడుతూ సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లే ఆధారం అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ప్రతి మనిషి ఒక మొక్క నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతలను తీసుకోవాలన్నారు. వనమహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్, రాష్ట్ర ఇన్చార్జ్ కొసరాజు,ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మైనారిటీ మోర్చా షేక్ బాజీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version