పత్రికా ప్రకటన
వచ్చే ఏడాది మార్చిలోగా రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
పలాస, జూలై 29:పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ని వచ్చే ఏదాది మార్చి నెలలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైల్వే ఫ్లైఓవర్ వంతెన పునః పనులకు శాసనసభ్యులు గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల అనుగుణంగా ప్రజా సహకారంతో శాశ్వతంగా నిలిచేలా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గత ప్రభుత్వం లో రైల్వే బ్రిడ్జి నిర్మాణ గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం వలన పనులు నిలిచిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో రైల్వే బ్రిడ్జి పనులను ప్రారంభించగలిగామన్నారు. రైల్వే శాఖ మంత్రి నీ స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కలిసి కృషి ఫలితంగా బ్రిడ్జి నిర్మాణానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న సుమారు 6 కోట్ల బిల్లులను గుత్తేదారులకు చెల్లించినట్లు వెల్లడించారు. రైల్వే వంతెన పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరంతర పర్యవేక్షణతో పనులు వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను జిల్లాకు తీసుకువచ్చి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ను ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. రైల్వే వంతెన నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన పేదలకు ఇల్లు స్థలాలు మంజూరు చేస్తామని, రైల్వే శాఖ నుండి నష్టపరిహారాన్ని కూడా పంపిణీ చేస్తామన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఏ ఒక్కరూ నష్టపోకూడదు అన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
ప్రజల సహకారంతోనే ఎయిర్ పోర్టు నిర్మాణం
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం , కుప్పం జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణాలకు ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఇందుకోసం టిడ్కో నుండి నిధులు మంజూరు చేసి సర్వే నిర్వహించి భూసేకరణ చేపట్టినట్లు తెలిపారు. భూ సర్వే వలన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమరావతి ల్యాండ్ పోలింగ్ విధానం పాటించి ఇక్కడ రైతులకు న్యాయం జరిగేటట్లు, అదేవిధంగా విమానాశ్రయము నిర్మించి అభివృద్ధి చెందే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ , రెవెన్యూ యంత్రాంగంతో ఎయిర్పోర్టు నిర్మాణం వలన భూములు కోల్పోయే రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. ఎయిర్ పోర్టు నిర్మించనున్న ప్రాంత రైతులకు ప్రభుత్వం నుంచి మెరుగైన ప్యాకేజీ అందేలా కృషి చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ రెవిన్యూ పరంగా భూ సమస్యలు పరిష్కరించి ఉపాధి కోల్పోయిన వారికి రైల్వే శాఖ నుండి నష్టపరిహారం అందించనున్నామన్నారు. ప్రతి మంగళవారం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే పర్యవేక్షించి పరిష్కరిస్తానన్నారు. కేంద్రపరంగా సహాయం అవసరమైతే కేంద్ర విమాన యాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు రైల్వే వంతెన నిర్మాణానికి అవసరమైన మెటీరియల్, శాంతి భద్రతల సమస్యలు లేకుండా పనులు వేగవంతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
ఎమ్మెల్యే గౌటు శిరీషా మాట్లాడుతూ ఎన్నికల మీ మేరకు తొలి సంవత్సరంలోనే 80 శాతం వరకు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేయడంతో పాటు గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్ షోర్ ప్రాజెక్టు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లకు పూర్తి స్థయిలో నిధులు రప్పించిన కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో భూములు కోల్పోయిన 9 మంది భూ యజమానులకు 22 లక్షల 19 వేల చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
అంతకుముందు వజ్రపు కొత్తూరు మండలం పూడిక లంకలో అంచనా వ్యయం రూ.4కోట్లతో నిర్మించనున్న వంతెన పునః నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు గౌత శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, శాసనసభ్యులు గౌతు శిరీష, విశాఖపట్నం గతి శక్తి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉప ప్రధాన ఇంజనీర్ పంకజ్ చౌహాన్, వాల్టేర్ ఏ ఎక్స్ ఈ ఎన్/కన్స్ట్రక్షన్/ ఆర్ ఎస్ పి డి.ప్రకాష్ రావు, ఆర్డిఓ జి. వెంకటేష్, తాసిల్దార్ టీ. కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.