రెచ్చిపోయిన దొంగలు – సిగ్నల్ కట్ చేసి – చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి
రైళ్లలో ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తమ చేతివాటం చూపిస్తూ రైల్వే పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి పాల్పడ్డారు. సిగ్నల్ వైర్లు కత్తిరించడంతో రైలు ఆగిపోయింది.
ఈ క్రమంలో దుండగులు ఎస్1, ఎస్2 బోగీల్లోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ముంబయి నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై బాధితులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు.