రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా

0

 20-3-2025 

ధి:20-3-2025 ఈరోజు అనగా గురువారం సాయంత్రం 4:30″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గ MLA కార్యాలయం నందు  GO నెంబర్ 105 తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా

లబ్ధిదారులకు  అందించారు

 ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా 8నెలల NDA కూటమి ప్రభుత్వం అనేక హామీలు నెరవేర్చిందని, అందులో ప్రధానమైనటువంటి సమస్య  ను పరిష్కరించి ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పట్టాలు మహిళలకు అందజేయడం జరిగిందని

 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని, మూడువేల రూపాయల పెన్షన్లు 4 వేల రూపాయలు చేశామని, మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, అమ్మ ఒడి కూడా జూన్ నుండి ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే కొంతమందికి వారి తల్లి అకౌంట్లో 15 వేల రూపాయల చొప్పున అందిస్తామని, అలాగే ప్రతి ఒక్క మహిళకు ఏడాదికి 18 వేల రూపాయల చొప్పున మే నెల నుండి అందిస్తామని

 అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని

ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  BC, SC, ST, మైనారిటీ పేదవారు బడుగు బలహీన వర్గాల ప్రజలు “ఇది మంచి ప్రభుత్వం” అని అంటున్నారని, అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో  గత వైసిపి పాలనలో అభివృద్ధికి నోచుకోనటువంటి రోడ్లను, నిరుపయోగంగా మారినటువంటి పార్కుల అభివృద్ధికి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అలాగే ఒకటో తారీకు పెన్షన్లు లబ్ధిదారుల ఇంటికే తీసుకొని వెళ్లి వారి చిరునవ్వుని చూస్తున్నామని, ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రతి డివిజన్లోని సమస్య పరిష్కరిస్తున్నానని నియోజకవర్గాన్ని ఒక మోడ్రన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని

 ఈ కార్యక్రమంలో:- కంచి ధన శేఖర్, మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణ మోహన్, మల్లేశ్వరరావు,బుగత శ్రీరాములు,కె.రామరాజు, కోలా దుర్గారావు,TPBO సునీత WPRS విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version