రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .

0

 రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత.

-మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణప్రసాదు .

గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 26.1.2025.

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ భారత దేశ ఔన్నతికి అందరం కృషి చేద్దామని, ప్రపంచ దేశాలకు మన దేశ సత్తాను చాటి చెబుదామని మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణప్రసాదు  పిలుపునిచ్చారు.

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.  జాతిపిత మహాత్మా గాంధీ  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు  మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అధికారికంగా అమలులోకి రావడం ద్వారా భారతదేశం పూర్తిగా గణతంత్ర రాజ్యంగా మారిందన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు  ఉపముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్  ఏపీలో కూటమి ప్రభుత్వం నేతృత్వంలో పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశంలో, రాష్ట్రంలో పాలన ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉందామని దేశ, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version