ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి, ప్రముఖ వితరణశీలి, రచయిత సుధామూర్తి (73) ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెను ఇటీవల ఉమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే.
ఇవాళ తన భర్త నారాయణమూర్తి సమక్షంలో సుధామూర్తి ప్రమాణం చేశారు. పార్లమెంటు హౌస్ లోని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ చాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. సుధామూరి ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పియూష్ గోయల్ కూడా అక్కడే ఉన్నారు.
ఇంజినీర్ గా ప్రస్థానం ప్రారంభించి, ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ గానూ వ్యవహరించిన సుధామూర్తి, రచయితగా కన్నడ, ఆంగ్ల భాషల్లో అనేక పుస్తకాలు రచించారు.
గతంలో ప్రభుత్వ రంగ సంస్థ టెల్కోలో ఇంజినీర్ గా పనిచేసిన సుధామూర్తి… తన భర్త నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ప్రారంభించే సమయంలో ఆమె రూ.10 వేలు సాయంగా అందించారు. ఇప్పుడదే ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 80 బిలియన్ డాలర్లకు పైమాటే.
ఇక, సుధామూర్తి-నారాయణమూర్తి దంపతుల కుమార్తె అక్షత… బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అని తెలిసిందే.
Spread the love నిన్న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఢిల్లీ పోలీసులు ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేశారు. హషీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని […]
Spread the love ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ఒక పని అందిరి హృదయాలను గెలుచుకుంది. విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న […]
Spread the love స్వదేశంలో గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. అయితే, ఇదే టోర్నీలో గాయపడిన షమీ ఆ తర్వాత చికిత్స […]