రాజకీయ ప్రతినిధులతో సమీక్ష సమావేశం సెంట్రల్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ

0

 విజయవాడ నగరపాలక సంస్థ

19-03-2025

 రాజకీయ ప్రతినిధులతో సమీక్ష సమావేశం

సెంట్రల్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా  విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్  ఆఫీసర్ సెంట్రల్ నియోజకవర్గం  ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో  రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 ఈ సమావేశంలో ఓటర్ల సంఖ్య 1200 దాటిన ప్రాంతాల్లో సమీపంలోని పోలింగ్ స్టేషనులకు మార్పులు చేయాలని చర్చించారు. ఏ ఈఆర్వోలను, బిఎల్ఓ తో ఒక సమావేశం నిర్వహించి పోలింగ్ బూతులను బిఎల్ఓ తో పరిశీలించి, వసతులన్నీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల నుండి, దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు మార్చవలసిందిగా పొలిటికల్ పార్టీ ప్రతినిధులు కోరారు. 

 నూతన ఓటర్లకు ఓటర్ ఐడి పోస్ట్ ద్వారా కానీ వారి బి ఎల్ ఒ ద్వారా కానీ పంపిణీ చేసేటట్టు చర్యలు తీసుకోవాలని ఏ ఈ ఆర్ ఓ లకు ఆదేశాలు ఇచ్చారు. గేటెడ్ కమ్యూనిటీలో కాలనీలో గల ఓటర్లకు ఆ ప్రాంతంలో గల పోలింగ్ కేంద్రాలను కేటాయిస్తే ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు వేసే అవకాశం ఉంటుందని చర్చించారు. SVEEP ( సిస్టమాటిక్ ఓటర్లు ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్ పార్టిసిపేషన్ ) కార్యక్రమాల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించాలని ఈ సమావేశంలో చర్చించారు. 

 ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొక్వాల్, రాజకీయ ప్రతినిధులు ఎన్ నరసింహరావు (ఐ ఎన్ సి),  వీరభద్రరావు (సిపిఐ), వినోద్ కుమార్ (బీఎస్పీ), తరుణ్ (బిజెపి), సాంబశివరావు (టిడిపి), సుందర్ పాల్ (వైఎస్ఆర్సిపి) పరమేశ్వరరావు (ఏఏపీ), విజయవాడ నగర పాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్,  జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి,సెంట్రల్ తహసిల్దార్ ఎం వెంకటరామయ్య, నార్త్ తహసిల్దార్ ఎం సూర్యారావు, డిప్యూటీ తహసిల్దార్ సెంట్రల్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version