యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

0

 యువగళం లో లోకేష్ వేసిన తొలి అడుగు రాష్ట్ర దశ-దిశను మార్చింది

కుతంత్రాలు చేసి అడ్డుకున్న గత ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించారు

లోకేష్ ఇచ్చిన భరోసా కొండంత అండగా 16 వ శాసనసభ ఎన్నికలకు ఒక మైలు రాయి అయ్యింది

యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి స‌రిగ్గా రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు ఎపి ప్రభుత్వ విప్, గన్నవరం శానససభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం నుండి పత్రిక ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం యువగళం లో లోకేష్ వేసిన తొలి అడుగు రాష్ట్ర దశ-దిశను మార్చిందని అన్నారు. 

ఎన్నో ఆటంకాలు ఎదురైనా, ఎన్నో ఇబ్బందులు సృష్టించినా, కుళ్ళు కుతంత్రాలతో అడ్డుకోవాలని చూసినా , జీవో లు తెచ్చినా, మైక్ లేకుండా చేసిన , జనం గొంతుకగా ప్రశ్నించారని అన్నారు. ఊరు, వాడ, పంచాయితీల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో నాటి ప్రభుత్వ తప్పులని ఎత్తి చూపుతూ, ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతు మాట్లాడిన తీరు అమోఘమని కొనియాడారు. జనమే బలమై, బలగమై లోకేష్ నిలిచారన్నారు. రాష్ట్రాన్ని కాపాడడంలో యువగళం పాదయాత్రలో లోకేష్ వేసిన ప్రతి అడుగు తెలుగుదేశం శ్రేణుల్లో నమ్మకం, పోరాటం, కేసులకు వెరవని తత్వం, ఉత్సాహం,ఉద్వేగం ఎమోషన్ గా మారిందన్నారు. లోకేష్ ఇచ్చిన భరోసా కొండంత అండగా 16 వ శాసనసభ ఎన్నికలకు ఒక మైలు రాయి అయ్యిందన్నారు. ఇప్పటికీ యువగళం పాట లోకేష్ పాదయాత్రను ను గుర్తు చేస్తుందన్నారు. ఒక అడుగుతో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర విజయవాడ వచ్చేసరికి జైత్రయాత్రగా మారిపోయిందనీ… గన్నవరం సభలో చెప్పిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు, అప్రతిహ జైత్రయాత్రగా లోకేష్ రాజకీయ జీవితం విలసిల్లాలని  బాసిల్లాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నట్లు చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version