మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ తో అబ్దుల్ అజీజ్ సమీక్ష.

0

 విజయవాడ, 10 – 03 – 2025

మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ తో అబ్దుల్ అజీజ్ సమీక్ష.

వక్ఫ్ బోర్డ్ ను వివిధ రంగాల్లో అభివృద్ధి పరచాలి.

మైనార్టీ ల ఆర్థిక స్థితి ని మెరుగుపరచాలి.

ప్రణాళిక ను త్వరితగతిన రూపొందించండి.

 షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్

విజయవాడ బందర్ రోడ్డు లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ శ్రీధర్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వక్ఫ్ బోర్డ్ కు ఏ విధంగా ఉపయోగపడుతాయి అనే విషయం పై అధ్యయనం చేశారు. వక్ఫ్ ఆస్తులను ఎన్ని రకాలుగా అభివృద్ధి పరచగలం అనే అంశం పై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులను, వక్ఫ్ ఆస్తులను ఉపయోగించి క్రీడ, వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయ, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో వక్ఫ్ బోర్డ్ ను అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు. ఆదాయాన్ని పెంచి, వచ్చిన ఆదాయాన్ని మైనారిటీ ల అభ్యున్నతికి ఉపయోగించాలని, తద్వారా మైనార్టీ ల యొక్క ఆర్ధిక స్థితిని మెరుగుపరచాలని అబ్దుల్ అజీజ్ అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన ప్రణాళికను త్వరితగతిన రూపొందించాలని పేర్కొన్నారు. వారితో వక్ఫ్ బోర్డ్ సీఈఓ మొహమ్మద్ అలీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version