ముస్లిం సోదరులు జరుపుకునే రెండవ అతి పెద్ద పర్వదినం ఈద్-ఉల్-అజా (బక్రీద్) పండుగ -MLA బొండా ఉమ

0

7-6-2025

ముస్లిం సోదరులు జరుపుకునే రెండవ అతి పెద్ద పర్వదినం ఈద్-ఉల్-అజా (బక్రీద్) పండుగ -MLA బొండా ఉమ

ధి:7-6-2025 58వ డివిజన్ సింగ్ నగర్ షాదీ ఖానా నందు మరియు 63వ డివిజన్ కొత్త రాజీవ్ నగర్ మసీదు నందు, ముస్లిం సోదరుల తో కలిసి బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా నమాజ్ ప్రత్యేక ప్రార్థనలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు…ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- అల్లా దయతో ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్లు, సింగ్ నగర్ షాది ఖానా ఈద్గా ఆవరణలో 19 మసీదులకు చెందిన వేలాదిమంది ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ప్రార్ధనలు జరుపుకోవడం చాలా సంతోషమని…అల్లాహ్ ఆజ్ఞ అనుసరించి ఇస్లాంలో ముస్లిం సోదరులు పాటించే త్యాగం, అంకితభావాలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ పండుగ నిలుస్తుందని, అల్లాహ్ ఆదేశం ప్రకారం ప్రవక్త హజరత్ ఇబ్రహీం తన పుత్రుడైన ఇస్మాయిల్ ను బలి ఇవ్వటానికి సిద్ధమవుతాడన్నారు, ఇబ్రహీం త్యాగనిరతికి అల్లాహ్ పెట్టిన పరీక్షలో కన్నబిడ్డపై ప్రేమ కంటే అల్లాహ్ ఆజ్ఞకే ప్రాధాన్యత ఇచ్చిన ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్ చిన్నారి ఇస్మాయిల్ స్థానంలో గొర్రెను మార్చి చిన్నారిని తిరిగి తండ్రి ఒడికి చేర్చుతారని,  అల్లాహ్ మార్గంలో నడిచే ముస్లింలు పాటించే త్యాగ నిరతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే ఈ బక్రీద్ పర్వదినం ముస్లింల జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆనంద ఉత్సాహాలు నింపాలని కోరుకుంటున్నట్లు ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు…ఈ కార్యక్రమాలలో:- సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version