పేదింటి పెళ్ళికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం

0

పేదింటి పెళ్ళికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం

100 కేజీల బియ్యం అందించిన ఎన్ టి ఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ,ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు ఆపత్కాలంలో నేనున్నానంటూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తనదైన శైలిలో నియోజవర్గ ప్రజల కోసం విద్య ,వైద్యం, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పేదలకు అండగా నిలుస్తున్న ఆయన నిరుపేద అయిన షేక్ అల్తాఫ్ కుటుంబానికి 100 కేజీల బియ్యం అందించారు రాజరాజేశ్వరి పేటకు చెందిన అల్తాఫ్ టైలరింగ్ చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు . తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని తన కూతురు పెళ్లి నిమిత్తం సాయం చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కోరారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ప్రత్తిపాటి శ్రీధర్ , అడ్డూరి శ్రీరామ్ 100 కేజీల బియ్యం అందించి చేయూతనిచ్చారు . ఎమ్మెల్యే సుజనాకు అల్తాఫ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు యేదుపాటి రామయ్య, కే శివశర్మ, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, కందుల సుబ్రహ్మణ్యేశ్వర రావు, అవ్వారు బుల్లబ్బాయి, బాయన హేరంభ కుమార్, నున్న కృష్ణ, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు, కుంచెం శివకుమారి,సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version