ముస్లిం సోద‌రులందరికీ రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

0

 

01.03.2025

ముస్లిం సోద‌రులందరికీ రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు

వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

దైవం పట్ల విధేయతతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి నిత్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నియమాలు ముస్లింలతో పాటు సర్వమానవాళికి అనుసరణీయమని.. సన్మార్గ జీవన విధానానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్రవ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన‌ది రంజాన్ మాసంలోనే కావ‌డంతో ముస్లింలు ఈ నెల‌కు అత్యంత ప్రాముఖ్యత‌ నిస్తార‌ని మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తూ.. మ‌నిషిలోని చెడు భావాల్ని, అధ‌ర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని ఆయ‌న పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version