ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని

0

 22-11-2024

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని

ధి:22-11-2024 శుక్రవారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇటీవల చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలోని ఇద్దరుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గం లోని 59వ డివిజన్ సింగ్ నగర్ కు చెందిన  సయ్యద్ సలీమ్ కు ₹56,024 వేలరూపాయల చెక్కును  అలాగే 1వ డివిజన్ గుణదల కుచెందిన  పులివర్తి.ఆకాష్ కు  ₹1,43104 లక్ష నలభై వేల 104 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను  పంపిణీ చేశారు

 ఈ సందర్భంగా బొండా  ఉమ మాట్లాడుతూ:-అత్యవసర పరిస్థితుల్లో పేద మజ్జిగ తరగతి వారికి ఆరోగ్యశ్రీ నందు లేని జబ్బులకు చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్నకు అప్లై చేసుకున్న వారికి  చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరంలా మారింది అని పేర్కొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని..

రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు

ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు..

ఇటీవల సంభవించిన తుఫానులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన సహాయ కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన వేలాది మంది దాతలు సుమారు 600 కోట్ల నిధులను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారని ఇది చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ అని చెప్పారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, సెంట్రల్ MLA బొండా ఉమ కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు….

 ఈ కార్యక్రమంలో:-బంగారు నాయుడు,మరక శ్రీనివాస్,SK జాన్ వలి,ఘంటా కృష్ణమోహన్, గౌసియా,సత్య, వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version