భోజన సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన సేవలు అందిస్తూ

0

 భోజన సౌకర్యాలు కల్పిస్తూ

మెరుగైన సేవలు అందిస్తూ 

వరదలు, వర్షాలు, కారణంగా పశ్చిమ లోని అనేక డివిజన్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానిక ప్రజలకు ఆహారపరంగా అసౌకర్యం ఏర్పడకూడదని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ నియోజకవర్గ వ్యాప్తంగా భోజన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆహార పదార్థాలు తయారుచేసి ఎంతమంది వచ్చినా వడ్డించేలా భోజన సదుపాయం కల్పించారు.ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఉదయం నుంచి చిట్టినగర్ లో వరద బాధితులకు భోజనాలను వడ్డించారు. పాల ఫ్యాక్టరీ సమీపంలో వరదల్లో చిక్కుకున్న వృద్ధులు, పక్షవాత రోగులు అత్యవసర వైద్యం కోసం సంప్రదించగా పడవల ద్వారా తరలించారు. వరద బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version