బొండా ఉమా ఆదేశాల మేరకు అన్ని దివిజన్ లలో ఉన్న సచివాలయ సిబ్బంది ద్వారా నెలవారి పెన్షన్ల పంపిణీ

0

 30-11-2024

బొండా ఉమా ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గం లోని అన్ని దివిజన్ లలో ఉన్న సచివాలయ సిబ్బంది ద్వారా నెలవారి పెన్షన్ల పంపిణీ

ధి:30-11-2024 శనివారం ఉదయం 6 గంటల నుండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21డివిజన్ లలో ఉన్న అర్హత కలిగినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారుల అందరికీ ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందితో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు పెన్షన్ దారుల ఇంటికే వెళ్లి స్వయంగా వారి చేతికి అందించడం జరిగినది.

ఈ సందర్భంగా:-సెంట్రల్ నియోజకవర్గంలోని మధురానగర్, శ్రీనగర్, ముత్యాలంపాడు తదితర ప్రాంతాలతో పాటు సింగ్ నగర్ 59వ డివిజన్ MK బేక్ స్కూల్ వద్ద 27 వ డివిజన్ బాబాజీ పేటలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు డివిజన్ పార్టీ నాయకులైన మాజీ కార్పొరేటర్ పిన్నమరాజు త్రిమూర్తి రాజు, Sk జాన్ వలి, పడమటి రామకృష్ణ, గుడివాడ దీపక్, బంగారు నాయుడు, ప్రసాద్ లతో కలిసి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగినది.

  ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ:- అవ్వ తాతల పెన్షన్ 4000,వికలాంగుల పెన్షన్ 6000,లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే “అన్న క్యాంటీన్లు”, యువత భవిష్యత్తుకు “మెగాడీఎస్సీ” ప్రజల ఆస్తుల భద్రతకు  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు, కేంద్రం, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పని చేస్తున్నాయని..

నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ప్రతినెల ఒకటో తారీకు కన్నా ముందే పెన్షన్లను వారి ఇంటికి తెచ్చి ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని, అర్హులైన అందరికీ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందితో కలిసి రేపు ఒకటో తారీకు ఆదివారం కావడంతో ముందు రోజే లబ్ధిదారులకు పెన్షన్లను అందజేయడం చాలా సంతోషంగా ఉన్నదని

పెన్షన్లు తీసుకున్నటువంటి వారు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

వచ్చే మాసం నుంచి నూతనంగా కొత్త పెన్షన్ దరఖాస్తులను అర్హులైనటువంటి వారికి దాఖలు చేసుకునే విధంగా విధివిధానాలు NDA కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించబోతుంది అని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో:- Sk ఫర్వీన్, మరక శ్రీనివాస్, మహేష్, దుర్గారావు, రాంబాబు,రత్నకుమారి, నాగమణి,పడమటి రామకృష్ణ,కర్ణం శ్రీరాములు, లాలాజీ, బాలాజీ,శేషమ్మ తదితరులు పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version