బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు

0

 బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

* ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ

* 2 నెలల్లో యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు

* అర్హులకే ఆర్థిక చేయూతనివ్వండి : మంత్రి సవిత

*విజయవాడ :* ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని, గడువులోగా యూనిట్లు గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడవును ఈ నెల 12 వ తేదీన వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు. గురువారం విజయవాడ నగరం గొల్లపూడిలో ఉన్న బీసీ భవన్ లో రాష్ట్రంలో వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో రుణాలు-సద్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మరో 2 నెలల్లో ముగినుందని, తక్షణమే అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని స్పష్టంచేశారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక చేయూతను వినియోగించుకునేలా లబ్ధిదారుల్లో చైతన్యం కలిగించి, తక్షణమే యూనిట్లు గ్రౌండింగయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులు కూడా కేటాయించామన్నారు. 

*12 వరకూ దరఖాస్తుల గడువు పెంపు*

లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పనకు స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును ఈ నెల 12 తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇదే విషయమై జిల్లాల్లో లబ్ధిదారులకు సమాచారమందించాలని సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చోటుచేసుకోకుండా తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాబోయే బడ్జెట్ లో బీసీ కార్పొరేషన్ల మరింత నిధులు కేటాయించేలా కృషి చేస్తామన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు వ్యక్తం చేసిన సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సవితను కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి గురుమూర్తి, డూండీ రాకేశ్, నందం అబద్ధయ్య, సదాశివం, దేవేంద్రప్ప, కృష్ణంనాయుడు, చిలకలపూడి పాపారావు, సావిత్రి, పీవీజీ కుమార్, మళ్ల సురేంద్ర, కప్పట్రాల సుశీలమ్మ, పాలవలస యశస్వివి, నరిసింహ యాదవ్ సహా పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version