ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటాం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ నంద్యాల జిల్లా మహాసభ లో ఏపీజేయు రాష్ట్ర అధ్యక్షులు కాకమాను వెంకట వేణు

0

ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటాం

  • ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ నంద్యాల జిల్లా మహాసభ లో ఏపీజేయు రాష్ట్ర అధ్యక్షులు కాకమాను వెంకట వేణు

నంద్యాల, జూలై 27: జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటామని, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకమాను వెంకట వేణు అన్నారు, గౌరవ అధ్యక్షులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందవరం శ్రీనివాసులు, సీఎం నాగేంద్ర నేతృత్వంలో ఏపీజేయు జిల్లా మహాసభ నిర్వహించారు. ఆదివారం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ నిశాంత్ భవన్ లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు, ఈ సందర్భంగా అధ్యక్షుడు కాకమాను వెంకట వేణు మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఏ యూనియన్ అయినా సరే తమ స్వలాభం కోసం పనిచేయకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని, కొన్ని పెద్ద సంఘాలు అని చెప్పుకుంటున్న యూనియన్లు వాళ్ళ స్వలాభమే చూసుకుంటున్నారన్నారు. నంద్యాలలో ప్రెస్ క్లబ్ కోసం విజ్ఞప్తులు చేశామని, ప్రెస్ క్లబ్ కోసం తమ యూనియన్ ద్వారా అన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసి సాధించుకుంటామని తెలిపారు. జర్నలిస్టులు నేడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, భీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం నంద్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు,

నంద్యాల జిల్లా నూతన కార్యవర్గం
గౌరవాధ్యక్షులుగా నరసింహమూర్తి, నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులుగా నందవరం శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీఎం నాగేంద్ర, కోశాధికారిగా అబ్దుల్ మజీద్, జిల్లా ఉపాధ్యక్షులుగా మరియాదాస్, చిర్రబోయిన రామన్న, మిద్దె చార్లెస్, కార్యదర్శులుగా టి శివ శంకర్, ప్రేమ్ కుమార్, ప్రసాద్, రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి గా షేక్ మౌలాలి, హాజీ సలాం, అబ్దుల్ హమీద్, తిమ్మప్ప, ఆర్గనైజింగ్ కార్యదర్శిలుగా అబ్దుల్ కరీం, సభ్యులుగా బాల మద్దిలేటి, జాకోబ్, మహేష్, సి శ్రీనివాసులు, ఎం శ్రీనివాసులు, బోధనం శ్రీనివాసులు, ఏ సి హెచ్ వెంకటేశ్వర్లు గా కమిటీని ప్రకటించారు.

జర్నలిస్టుల సమావేశానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది: కత్తి శ్రావణి రెడ్డి

జర్నలిస్టులో సమావేశానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆళ్లగడ్డ టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి అన్నారు, జర్నలిస్టులో ఎంతో ఆప్యాయతగా నన్ను గౌరవించి ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించినందుకు నేను చాలా గర్వపడుతున్నానని అన్నారు, జర్నలిస్టులు అంటే సమాజంలో నాలుగో స్తంభంగా పిలుస్తారని, కాబట్టి ఏ జర్నలిస్టుకైనా ఎటువంటి ఆపద వచ్చిన మా దృష్టికి తెస్తే ఖచ్చితంగా వారికి మా సహాయ సహకారాలు ఉంటుందని ఈ సందర్భంగా కత్తి శ్రావణి తెలిపారు.

ఏపీజేయు జిల్లా మహాసభ విజయవంతం

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా మహాసభ విజయవంతమైంది, ఆదివారం రెవిన్యూ నిశాంత్ భవన్ లో జరిగిన జిల్లా మహాసభకు నంద్యాల జిల్లా నుండి జర్నలిస్టుల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, ఈ మాసభకు సీనియర్ పాత్రికేయులకు, యువ పాత్రికేయులకు మహాసభ కు వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి శాలువా, ఏపీజేయు షీల్డ్, పూల బొకేతో ప్రతి ఒక్కరిని ఘనంగా సన్మానించి సభను విజయవంతం చేశారు,

ప్రతి ఒక్క పాత్రికేయుని

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పనిచేస్తాం

ఏపీజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు: నందవరం శ్రీనివాసులు, సీఎం నాగేంద్ర

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పనిచేస్తాంమని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని.. వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తామని ఏపీజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు: నందవరం శ్రీనివాసులు, సీఎం నాగేంద్ర అన్నారు. ఆదివారం నంద్యాలలో నరసింహమూర్తి అధ్యక్షతన జిల్లా మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టుల వైద్యం, పిల్లల విద్య, ఇతర సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యల సాధనం కోసం కేబినెట్లో జీఓ తీసుకొచ్చే విధంగా యూనియన్ పని చేస్తుందన్నారు. జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న ఏకైక యూనియన్ ఏపీజేయు అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version