ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు సుజన చౌదరి

0

 ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం 

శాసనసభ్యులు సుజన చౌదరి 

 రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” 5 వ రోజు కార్యక్రమం 54 వ డివిజన్ వించిపేటలో బుధవారం ప్రారంభించగా ఎమ్మెల్యే సుజనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల ఎన్డీఏ పాలనలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల చేత “ఇది మంచి ప్రభుత్వం” అని అనిపించుకునేలా చేశారన్నారు.అవ్వ తాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే “అన్న క్యాంటీన్లు”, యువత భవిష్యత్తుకు “మెగాడీఎస్సీ” ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రధాని మోడీ 10 ఏళ్ల పాలనలో 35 కోట్ల మంది పేదలను దారిద్రరేఖ నుంచి బయటకు తీసుకువచ్చారన్నారు. గత ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. అత్యధిక మెజారిటీతో కూటమికి మద్దతు ఇచ్చిన ప్రజల కోసం మరింత బాధ్యతగా పనిచేస్తామన్నారు. సాధ్య సాధ్యాలను పరిశీలించి ప్రయత్న లోపం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పని చేస్తున్నాయని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు నాగుల్ మీరా, బొమ్మసాని సుబ్బారావు, ఎమ్మెస్ బెగ్, తాజుద్దీన్, సలీం, హర్షద్, ఫతావుల్లా, అధికారులు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, స్పెషల్ ఆఫీసర్ సుబ్బారెడ్డి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version