ప్రజా నాయకులు వంగవీటి మోహన రంగా అన్ని వర్గాల ప్రజల గుండెచప్పుడు రంగన్న

0

 26-12-2024

 ప్రజా నాయకులు వంగవీటి మోహన రంగా

అన్ని వర్గాల ప్రజల గుండెచప్పుడు రంగన్న

36వ వర్ధంతి సభలో సెంట్రల్ నియోజకవర్గ MLA బొండా ఉమా

ధి:26-12-2024 గురువారం సాయంత్రం 7:00″గం లకు” విజయవాడ – పాయకాపురం కండ్రిక కూడలి లో ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం అర్పించిన అనంతరం పేదలకు ఫ్రూట్స్, చీరలు, దుప్పట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది..

 ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- వంగవీటి మోహన రంగా అమరులై 36 సంవత్సరాలు గడిచిన నేటికీ ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో ఉందని అన్నారు, వంగవీటి మోహనరంగా సామాన్య కుటుంబంలో పుట్టి విజయవాడ ప్రజలతో మమేకమై కార్పొరేటర్ గా శాసన గెలుపొంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం తుధికంటూ నిలిచిన ప్రజానేత వంగవీటి మోహన రంగా అని, ఆనాడు విజయవాడలో రౌడీలకు, దౌర్జన్య కారులకు మహిళల పైన ఆకృత్యాలు చేసేటువారికి వ్యతిరేకంగా నిలిచి వారిని నగరం నుండి తరిమి కొట్టిన చరిత్రకారుడు వంగవీటి మోహనరంగా అని, అటు కృష్ణలంకలో ఇటు గాంధీ నగర్ లో మరొకపక్క సింగ్ నగర్ పాయికాపురంలో ఇంకొకపక్క పాతబస్తీలో ఎవరికి ఏ సమయంలో ఆపద కలిగింది అన్న క్షణాలలో అక్కడ ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసిన ప్రజల గుండెచప్పుడు రంగన్న అని ఆయన చేసినటువంటి సేవలను ఆయన నడిచినటువంటి క్రమశిక్షణతో కూడిన నడావికాలలోని అనేక అంశాలను వేదికపై తెలియజేయడం జరిగినది…

 ఆనాడు ఆయన శిష్యులుగా అనుచరులుగా నడిచిన మేము ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాము అంటే ఆయన దగ్గర నుండి నేర్చుకున్న ఆయన చూపినటువంటి మార్గమే అని ఆనాడు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు..

 వంగవీటి మోహనరంగా ఆసయ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రంగా అభిమానులను సమీకరించి 36వ వర్ధంతి ఈ ప్రాంతంలో నిర్వహించి ఈ కూడలికి వంగవీటి మోహనరంగా సర్కిల్ అని నామకరణం చేయడం అందరూ సంతోషించదగిన విషయం అని కొని ఆడారు.

ఈ కార్యక్రమానికి:- వంగవీటి మోహనరంగా ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు మద్ధం శెట్టి వీరాంజనేయులు (అంజి బాబు ) నేతృత్వం వహించగా రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, బిల్లింగ్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడగా, నవనీతం సాంబశివరావు సభకు అధ్యక్షత వహించగా, నాయకులు SVR నాగరాజు, ఒట్టే వెంకటేశ్వరరావు, పరుచూరి ప్రసాద్, దాసరి కనకారావు, సూరవరపు నాగరాజు, పైడి శ్రీను, బత్తుల కొండా, పందిరి వాసు,పత్రి చిన్న, సవరం కోటేశ్వరరావు, ఖందా సాంబశివరావు, అట్టాడ నూరేంద్ర , మాడ సత్తిబాబు, లతోపాటు వేలాదిమంది పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version