ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం ఎమ్మెల్యే సుజనా చౌదరి

0

 ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం 

ఎమ్మెల్యే సుజనా చౌదరి

 

సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 

ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 14 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా  నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ  సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. సుజన ఫౌండేషన్ , షేర్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపును  గురువారం కొత్తపేట కేబీఎన్ కళాశాలలో  ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ  పేద మధ్యతరగతి, వర్గాలు ఎక్కువగా ఉన్న  పశ్చిమ ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ హెల్త్ క్యాంపు ద్వారా  కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, థైరాయిడ్, , టిబి ,  సంబంధిత వ్యాధులు డెంగ్యూ ఫీవర్, మొదలైన జబ్బులకు ఉచితంగా పరీక్షలను నిర్వహించి  మందులను అందజేస్తామన్నారు. పశ్చిమ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి  నిష్ణాతులైన  వైద్య సిబ్బందిని నియమించామన్నారు.  మొదటి విడుత హెల్త్ క్యాంపును ఈ నెల 16 నుంచి 23 వ తేదీ వరకు భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పార్లమెంట్  సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి   విద్యా, వైద్యం, ఆరోగ్యం, మొదలైన రంగాలకు ప్రాధాన్యమిచ్చి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న సుజనా చౌదరికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి డీఎస్సీ కోచింగ్ సెంటర్లను, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నామన్నారు. 

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ సుజనా చౌదరి కేశినేని శివనాథ్ ల బంధం అన్నదమ్ముల కలయిక వంటిదని వీరిద్దరి కలయికలొ విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది అన్నారు. సుజనా కు పబ్లిసిటీ ఆర్భాటాలు అవసరం లేదని ఆయనే ఒక బ్రాండ్ గా మారి పశ్చిమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు వాలంటీర్లు, కూటమి నాయకులు, ఐక్యంగా కలిసి మెగా హెల్త్ క్యాంపు ని విజయవంతం చేయాలని కోరారు. 

కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు,టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎమ్మెస్ బైగ్, జనసేన ఆంధ్రా జోన్ కన్వీనర్  భాడిత శంకర్, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు, కె బి న్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ శ్రీనివాస్, జి వి యన్ ప్రసాద్, షేర్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ పి యస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మధుమోహన్, హెల్త్ క్యాంప్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ బొమ్మ కంటి వెంకటరమణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version