03-08-2025
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ది బాటలో పయనిస్తుంది
బాధితులకు భరోసా సీఎం సహాయ నిధి : ఎంపీ కేశినేని శివనాథ్
ఆరుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
విజయవాడ : ప్రజలు ఆరోగ్యంగా వుంటేనే రాష్ట్రం అభివృద్దిలో పయనిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు విశ్వసిస్తారని, అందువల్ల రాష్ట్రంలో పేదల వైద్య ఖర్చులను సీఎం సహాయ నిధి ద్వారా అందజేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.8 లక్షల 30 వేల 482 విలువగల ఆరు చెక్కులను ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
పెద్ద పేగు ఆపరేషన్ జరిగిన మండపాక నళిని మోహన్ కి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.3 లక్షల చెక్కును, బ్లడ్ సర్క్యూలేషన్ ఆగి కాలు తొలగింపు ఆపరేషన్ చేయించుకున్న ఉంగారాల గద్దెయ్య కి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.97,921 చెక్కును ఆయన కుమార్తె ఉంగారాల కనకశ్రీకి, లివర్ సమస్య కారణంగా మృతి చెందిన వూటుకూరి నరసింహారావు కి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.96,030 చెక్కును, ఆయన కుమారుడు లక్ష్మీ దుర్గా మారుతికి , క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్న సి.హెచ్. వరలక్ష్మీ సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.77,000 చెక్కును, ఊపిరితిత్తులు,ఛాతి నొప్పి సమస్యతో బాదపడిన పలంకి విజయకుమారికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.1,55,302 చెక్కును, గుండె సమస్యతో బాధపడిన చెందిన గుల్లపల్లి సుబ్రహ్మాణ్యం కి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.1,04,229 చెక్కును ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. తమకి సీఎంఆర్ఎఫ్ వచ్చే విధంగా సాయం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి లబ్ధిదారులు కృతజ్ఞతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు మన్నే జయప్రకాష్ , కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణిలతో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.