పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగం లక్ష్యం సామినేని ఉదయభాను

0

పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగం లక్ష్యం  సామినేని ఉదయభాను 

భారత రాజ్యాంగం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం కల్పించడమే రాజ్యాంగ లక్ష్యమని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను  అన్నారు

76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను  మరియు జనసేన యువనాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్  పాల్గొని జెండాను ఎగరవేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు

అనంతరం ఉదయభాను  మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుంచే  మన దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా మారిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన మహనీయులు త్యాగాలు భావితరాలకు ఆదర్శం కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version