పోలీస్ కమిషనర్ రామకృష్ణ ని కలిసి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్న టిడిపి, బిజెపి, జనసేన కూటమి నాయకుల పై ఫిర్యాదు చేసి

0

 విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ ని కలిసి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్న టిడిపి, బిజెపి, జనసేన కూటమి నాయకుల పై ఫిర్యాదు చేసి

 తక్షణమే వారిని అదుపులోకి తీసుకొని చట్టప్రకారం వారిని శిక్షించవలసిందిగా కోరిన వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు , రాయన భాగ్యలక్ష్మి , మొండితోక అరుణ్ కుమార్ షేక్ అసిఫ్ నల్లగట్ల స్వామి దాస్ , సర్నాల తిరుపతి రావు , కైలే అనిల్ కుమార్ , పాతిన మహేష్ న్యాయవాదులు కోటంరాజు వెంకటేష్ శర్మ , ఒగ్గు గవాస్కర్ తదితర వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైలవరపు దుర్గారావు పై దాడి చేసిన టిడిపి, బిజెపి, జనసేన కూటమి నాయకుల పై మరియు తిరువూరు నియోజవర్గం, ఏ కొండూరు మండలం, కంభంపాడు గ్రామానికి సంబంధించి MPP సభ్యురాలు కలసాని నాగ లక్ష్మి పై అక్కడ స్థానిక TDP శాసనసభ్యులు K.శ్రీనివాస్ అతని సుమారు 1000 మంది అనుచరులతో దాడి చేసి ఆమెకు సంబంధించిన నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం JCBలతో కూల్చివేశారు, పై తెలిపిన రెండు ఘటనల పై మరియు టిడిపి, బిజెపి, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి ఆస్తుల పై కక్షపూరితంగా దాడులు చేస్తు రాక్షసానందం పొందుతున్న టిడిపి, బిజెపి, జనసేన నాయకులను వెంటనే అదుపులోకి తీసుకొని చట్టప్రకారం శిక్షించవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ ని నేడు మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు మల్లాది విష్ణు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి , శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ పశ్చిమ ఇంచార్జ్ షేక్ అసిఫ్ తిరువురు ఇంచార్జ్ నల్లగట్ల స్వామి దాస్ మైలవరం ఇంచార్జ్ సర్నాల తిరుపతిరావు, మాజీ శాసన సభ్యులు కైలే అనిల్ కుమార్ నాయకులు పాతిన మహేష్ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు కోటంరాజు వెంకటేష్ శర్మ , ఒగ్గు గవాస్కర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు*

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version