పొంగి పొర్లుతున్న డ్రైనేజ్
పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విన్నవించిన స్థానికులు
ఎమ్మెల్యే ఆదేశాలతో
39 వ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీ డ్రైనేజీ పనులు చేసిన కార్పొరేషన్ సిబ్బంది
విజయవాడ పశ్చిమ జులై 4.
నియోజకవర్గంలోని వివిధ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆయా సమస్యలను
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి
పరిష్కారం చేస్తున్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో 39 వ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీలో డ్రైనేజీ లీక్ అవడంతో నీరు పైకి పొంగి పొర్లుతున్న తీరు తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు సుజనా చౌదరి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సంజయ్ గాంధీ కాలనీలోని డ్రైనేజీ పనులు కార్పొరేషన్ సిబ్బంది చేపట్టారు.
సమస్య పరిష్కారం కు కృషి చేసిన ఎమ్మెల్యేకు సంజయ్ గాంధీ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.