సీఎం కేసీఆర్ ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. మంచి చెడు ఆలోచించి ఓటేయాలని ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. పువ్వాడ అజయ్ ని గెలిపిస్తే ప్రజలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని, అలా కాదని తుమ్మలు (తుమ్మల నాగేశ్వరరావు), తుప్పలు తెచ్చుకుంటే ముళ్లు గుచ్చుకునేది మీకే అని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ పువ్వులు కావాలో, తుమ్మ ముళ్లు కావాలో తేల్చుకోండి అని స్పష్టం చేశారు.
పువ్వాడ అజయ్ పట్టుబట్టి తనతో రూ.700 కోట్లు మంజూరు చేయించుకున్నాడని, ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని కేసీఆర్ వెల్లడించారు. ఖమ్మం పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని పువ్వాడ అజయ్ భావిస్తున్నాడని, దయచేసి అజయ్ ను మరోసారి గెలిపించాలని కోరారు.
“ఖమ్మంలో ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు లేవు. ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఖమ్మం ఇప్పుడెంత భద్రంగా ఉందో చూడండి. ఖమ్మం అంటే ఆరు వరుసల రోడ్లు, గల్లీల్లో కూడా వైట్ టాప్ సిమెంట్ రోడ్లు, రోడ్ల పక్కన వెలుగులు విరజిమ్మే లైట్లు, పచ్చని చెట్లతో ఖమ్మం అలరారుతోంది. ఇదంతా ఏదో మంత్రం వేస్తే జరగలేదు. పువ్వాడ అజయ్ కష్టపడి పనిచేశాడు కాబట్టే ఇంత అభివృద్ధి జరిగింది” అని సీఎం కేసీఆర్ వివరించారు.
Spread the love ఈసారి ఫిబ్రవరి నుంచే ప్రతాపం చూపిస్తున్న భానుడు మార్చిలో మరింతగా చెలరేగుతున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సగటు ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటేశాయి. ఈ వారంలోనే 40 డిగ్రీలు […]
Spread the love బీఆర్ఎస్ పదేళ్లలో చెయ్యలేనివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో చేసి చూపించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా మీడియా […]
Spread the love ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని […]